Bheemla Nayak 1st Day Total Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. భీమ్లా నాయక్ మూవీ తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆంధ్ర లో లో టికెట్ రేట్ల కారణంగా దెబ్బ పడినా కానీ నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ తో రచ్చ చేసిన ఈ మూవీ ఓవరాల్ గా ఫస్ట్ డే మొత్తం మీద 26.44 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక వరల్డ్ వైడ్ గా భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 34 కోట్ల నుండి 35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేయగా భీమ్లా నాయక్ మూవీ ఇక్కడ అంచనాలను మించి 36.37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసింది. మొత్తం మీద మూవీ ఫస్ట్ డే ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
నైజాం | 11.87 cr |
ఉత్తరాంధ్ర | 1.88 cr |
సీడెడ్ | 3.28 cr |
ఈస్ట్ | 1.95 cr |
వెస్ట్ | 3.02 cr |
గుంటూరు | 2.51 cr |
నెల్లూరు | 1.04 cr |
కృష్ణా | 0.89 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 26.44 cr (38CR Gross) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.10 cr |
ఓవర్సీస్ | 6.87 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 36.41 cr (56.52CR Gross) |
ఇదీ మొత్తం మీద భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్. మూవీ మొత్తం మీద 108 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మూవీ ఫస్ట్ డే (Bheemla Nayak 1st Day) సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 71.59 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక మూవీ రెండో రోజు నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది చూడాలి మరి