Bheemla Nayak OTT Release Update : పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టగా మూవీ ఇప్పుడు డిజిటల్ లో కూడా రిలీజ్ అవ్వడం కన్ఫాం అయిపొయింది. మూవీ రెండు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఒకే సారి రిలీజ్ అవ్వడం కన్ఫాం అయింది. మూవీ ఇప్పుడు ఈ నెల 25న అటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇటు ఆహా వీడియో (Bheemla Nayak OTT) లో ఒకేసారి డిజిటల్ లో రిలీజ్ కాబోతుంది. ఇక మూవీ డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి వారం గ్యాప్ ఉండగా ఈ వారంలో థియేటర్స్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.
మార్చి 25 నుంచి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే, ఇప్పుడు ఆహా ఓటీటీ టీమ్ కట్ చేసిన ట్రైలర్‌ను విడుదల చేసింది మరియు మూవీ చూసిన తర్వాత కూడా ట్రైలర్ చూడటం చాలా ఎక్సైటింగ్‌గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా భీమ్లా నాయక్ మూవీ ఆహా కట్ ట్రైలర్‌ని చూసి ఆనందించండి.
భీమ్లా నాయక్ మూవీ 22 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మూవీ మూడు వారాలను పూర్తీ చేసుకున్న తర్వాత మూవీ ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టగా మూవీ మొత్తం మీద 140 థియేటర్స్ లో ఇప్పుడు నాలుగో వారాన్ని కొనసాగిస్తుంది. భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 22 వ రోజు హోళీ అడ్వాంటేజ్ వలన కొద్ది వరకు గ్రోత్ ని చూపెట్టింది కానీ ఇంకా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దదిగానే ఉందని చెప్పాలి.
ఇక మూవీ 21 వ రోజు 3 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 22 వ రోజు మొత్తం మీద 3 లక్షల గ్రోత్ ని చూపెట్టి 6 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది రెండు తెలుగు రాష్ట్రాలలో.. ఇక భీమ్లా నాయక్ మూవీ 22 రోజుల్లో మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
AP-TG Total:- 76.70CR(117.55Cr Gross)
KA+ROI: 8.23Cr
OS: 12.53Cr
Total World Wide: 97.46CR(158.76CR Gross)
భీమ్లా నాయక్ మూవీ మొత్తం మీద 108 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి ఇంకా 10.50 కోట్ల దూరంలో ఉంది.