Beast Movie Trailer : కోలివుడ్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్. ఈ నెల 13 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. రీసెంట్ టైం లో వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్న హీరో విజయ్ ఒక పక్కా మరియు డాక్టర్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ నెల్సన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఎక్స్ పెర్టేషన్స్ అయితే మరో లెవల్ లో ఉండగా మూవీ ఇప్పటి వరకు 2 పాటల తోనే విపరీతమైన హైప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా. ఇప్పుడు డైరెక్ట్ గా మూవీ ట్రైలర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు మూవీ మేకర్స్.
రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ చూసిన తర్వాత మూవీ మీద ఉన్న అంచనాలు పెరిగి పోయాయి.. ఆ రేంజ్ లో మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. చెన్నై లోని ఓ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేయగా ఆ మాల్ లో అనుకోకుండా ఇండియన్ స్పెషల్ స్పై ఆఫీసర్ (హీరో విజయ్) కూడా ఉంటాడు.. ఆ టెర్రరిస్టుల నుండి ఆ మాల్ ని హీరో విజయ్ ఎలా కాపాడాడు అన్నది మూవీ కథ పాయింట్ గా ట్రైలర్ లోనే ఆల్ మోస్ట్ రివీల్ చేశారు మూవీ మేకర్స్. విజయ్ లుక్స్, మ్యానరిజమ్స్ మరియు హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో దుమ్ము దులిపేశాడు. ఇక ప్రతీ సీన్ చాలా రిచ్ గా ఉన్నాయి. అలాగే అన్ని సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ తో అనిరుద్ భీభత్సం సృష్టించాడు.
ఓవరాల్ గా స్టొరీ పాయింట్ చాలా వరకు షారుక్ ఖాన్ నటించిన మై హూ నా (Main Hoon Na) మూవీకి కథ కొంచెం దగ్గరగా ఉండడం మరియు ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేయడంతో కథ పరంగా ఎంత వరకు అంచనాలను పెట్టుకోవాలి అన్నది క్లియర్ చేశారు అని చెప్పొచ్చు. అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ట్రైలర్ 24 గంటల్లో యూట్యూబ్ లో ఓవరాల్ గా ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
Beast Movie Trailer :