Arjun About Vishwak Sen : యాక్టర్ విశ్వక్ సేన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తనదైన స్టైల్ లో విభిన్నమైన మూవీస్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటూ వెళ్తున్న విశ్వక్..రీసెంట్ గా ఓరి దేవుడా మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీలో వెంకటేష్ దేవుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న ఈ మాస్ హీరో మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు.
ఫలక్ నూమా దాస్ మూవీ ప్రమోషన్స్ సమయంలో కాంట్రవర్సీ అయిన ఈ హీరో ఇటీవల విడుదైలన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన పనికి వివాదంలో పడ్డాడు. అశోక వనంలో అర్జున కల్యాణం మూవీ ప్రమోషన్స్ స్టంట్ కింది ఓ ప్రాంక్ వీడియో చేసి అబాసుపాలయ్యాడు. అతి ఎంత పెద్ద రచ్చ అయిందో తెలిసిందే.
ప్రస్తుతం విశ్వక్ సేన్.. డైరెక్టర్ అండ్ యాక్టర్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ నెల 3 నుండి షెడ్యూల్ లో పాల్గొనాల్సిన విశ్వక్..షెడ్యూల్ లో పాల్గొనకపోగా , అర్జున్ కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదట. దీంతో విశ్వక్ సేన్ పై అర్జున్ సర్జా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదంపై మాట్లాడారు. ‘షూటింగ్ కు రమ్మని విశ్వక్ కు ఎన్నోసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. షెడ్యూల్ మార్చమని చెబుతున్నాడు. మొత్తం షెడ్యూల్ ఎలా మారుస్తారు. విశ్వక్ సేన్ బిహేవియర్ మా టీమ్ కు ఎంతో ఇబ్బందికి గురి చేసింది. ఈ విషయం గురించి అతనితో ఎన్నిసార్లు మాట్లాడాలని పిలిచినా విశ్వక్ సేన్ స్పందించలేదు’ అని అర్జున్ సర్జా చెప్పుకొచ్చాడు.
విశ్వక్ సేన్ ప్రవర్తన ఏమాత్రం బాలేదు. ప్రొడ్యూసర్ గిల్డ్, నిర్మాతల మండలిలో విశ్వక్ గురించి కంప్లేంట్ చేస్తున్నాం. నాకు జరిగినట్లు మరొకరికి జరగకూడదని కోరుకుంటున్నా. నాది మంచి కథ. త్వరలో మరొక హీరోతో సినిమా తీస్తాను అని అర్జున్ తెలిపారు.