Bright Telangana
Image default

CM KCR : రైతులకు షాక్.. యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

CM KCR on Paddy Procurement in Yasangi

తెలంగాణ : సోమవారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ వరి ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని ముందుగా చెబితే రైతులు వేరే పంట వేసుకుంటారని ఈ విషయం చెబుతున్నానని వ్యాఖ్యానించారు. కేంద్రంతో ఎంతో కొట్లాడిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.

యాసంగిలో రైతులు వరి పండించవద్దని స్పష్టం చేశారు. వర్షాకాలం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్న సీఎం కేసీఆర్.. వాటిని కేంద్రం కొనుగోలు చేయకపోతే ఢిల్లీలో తీసుకెళ్లి ప్రధాని ఇంటి ముందు, బీజేపీ ఆఫీసు ముందు పోస్తామని హెచ్చరించారు. రైతులు ఈ విషయాన్ని గుర్తించాలని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. రైతులు సొంతంగా వరి వేసుకుంటామంటే తమకు ఇబ్బంది లేదని అన్నారు.

తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిపాయిలా పోరాడాలి కానీ చేతకాని దద్దమ్మాలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ రైతు రాబందు పార్టీ అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ పరిపాలనలో దేశం ప్రతిష్ట దిగజారుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్లోబల్ హాంగర్ ఇండెక్స్‌లో భారత కంటే పక్కన ఉన్న దేశాలు గొప్పగా ఉన్నాయని తెలిపారు. గట్టిగా మాట్లాడితే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను కట్ చేస్తారని మండిపడ్డారు. దేశంలో రైతులు బాగుండాలి అంటే బీజేపీ ప్రభుత్వం పోవాలని వ్యాఖ్యానించారు.

Related posts

CM KCR On Dalithabandhu: దళితబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

Hardworkneverfail

CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్.. నేడు ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ

Hardworkneverfail

Megastar Chiranjeevi : కేసీఆర్ కి థాంక్స్ చెప్పిన చిరంజీవి.. మరి ఏపీ పరిస్థితేంటి..?

Hardworkneverfail

Mothkupally Narsimhulu: టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Hardworkneverfail

Rythu Bandhu : తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌.. డిసెంబర్ 15 నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!

Hardworkneverfail

IAMC Inauguration : ఐఏఎంసీని ప్రారంభించిన సీజీఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

Hardworkneverfail