CJI NV Ramana, CM KCR Inaugurates of IAMC : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ కలిసి శనివారం ఉదయం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్నిసీజేఐకు అప్పగించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఐఏఎంసీ ఏర్పాటు అవుతోంది. ఐఏఎంసీ శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు పూర్తయ్యాయి.
ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Dalitha Bandhu Scheme : దళితబంధు పై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష