Bright Telangana
Image default

Huzurabad By Elections: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ లో బీభత్సం..కొట్లాట-కుమ్ములాట..

హుజురాబాద్

వీణవంక మండలం కోర్కెల్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ – బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీ. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

టీఆర్ఎస్ నేత కౌషిక్ రెడ్డిని ఘన్ముక్ల గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలో కౌషిక్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాలు ఘర్షకు దిగాయి.

ఘన్ముక్లలో ఉద్రిక్తత.. మళ్లీ పోలింగ్ కేంద్రానికి కౌషిక్ రెడ్డి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీజేపీ నేతలు, గ్రామస్థులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నేత కౌషిక్ రెడ్డి కేంద్రానికి రావొద్దంటూ నినాదాలు చేశారు. ఎలక్షన్స్ చీఫ్ ఎజెంట్‌గా తనకు పోలింగ్ కేంద్రంలో ఉండే అధికారం ఉందని టీఆర్ఎస్ నాయకుడు కౌషిక్ రెడ్డి పేర్కొన్నారు. కావాలనే కొందరు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు.

పోలీసుల విజ్నప్తితో వెనుదిరిగిన కౌషిక్ రెడ్డి
ఘన్ముక్ల పోలింగ్ కేంద్రానికి కౌషిక్ రెడ్డి చేరుకోవడంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ నేత కౌషిక్ రెడ్డి పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లాలంటూ ఘన్ముక్ల గ్రామస్థులు, బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసుల విజ్నప్తితో కౌషిక్ రెడ్డి వెనుదిరిగారు. మళ్లీ వస్తానంటూ కార్యకర్తలకు చెప్పి వెనుదిరిగారు.

Related posts

Huzurabad By Election Exit Poll Survey : గెలుపెవరిది..?

Hardworkneverfail

Huzurabad By Election:హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో మనదే గెలుపు – సీఎం కేసీఆర్‌

Hardworkneverfail

Huzurbad By Elections: ప్రైవేట్ వాహనంలో ఈవీఎంల తరలింపు ?

Hardworkneverfail

Huzurabad By Election: డబ్బులు ఇవ్వలేదని ఓటర్ల రాస్తారోకో..!

Hardworkneverfail

హుజురాబాద్ లో నామినేషన్ వేసిన 26 మంది అభ్యర్థులు..

Hardworkneverfail

దళిత బంధు ప్రవేశపెట్టిన గ్రామంలో టీఆర్ఎస్ కు షాక్‌..!

Hardworkneverfail