India vs New Zealand : రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ 20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 3 టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది టీమిండియా. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ఇండియా సిరీస్ గెలుపొందింది.
టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ తీసుకోగా న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఇక కివీస్ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా సాధించింది. మూడు వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో 155 పరుగులు చేసి విజయ సాధించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 65 పరుగులు, రోహిత్ శర్మ 55 పరుగులతో రాణించారు. వెంకటేశ్ అయ్యర్ 12, రిషభ్ పంత్ 12 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక.. చివరి టీ20 మ్యాచ్ నవంబర్ 21న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.