క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. నవంబర్ 17వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో తన బాధ్యతలను స్వీకరించనున్నాడు రాహుల్ ద్రవిడ్. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డు వెల్లడించింది. ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎంపికవ్వడంపై ద్రవిడ్ స్పందించాడు. ” టీమ్ ఇండియాకు హెడ్ కోచ్‌గా ఎంపికవ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవం. కోచ్‌గా జట్టుతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా. రవిశాస్త్రి మార్గనిర్దేశంలో టీమ్ ఇండియా గొప్ప విజయాలను సాధించింది. నేను దీన్ని కొనసాగిస్తాననే నమ్మకంతో ఉన్నా. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న కొందరు ప్లేయర్లతో ఎన్‌సీఏ చీఫ్‌గా, ఇండియా అండర్–19, ఇండియా ‘ఎ’ జట్ల కోచ్‌గా నేను ఇప్పటికే పనిచేశా. రాబోయే రెండేళ్లలో టి20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు ఉన్నాయి. వాటిల్లో మంచి ఫలితాలు సాధించేందుకు టీమ్ సభ్యులతో, సహాయక సిబ్బందితో కలిసి పనిచేస్తా.” అంటూ చెప్పుకొచ్చాడు.