Kaikala Satyanarayana Praises AP CM Jagan : అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. సమస్యాత్మక పరిస్థితుల్లో తనకు, తన కుటుంబ సభ్యులకు అండగా నిలిచినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కైకాల సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి కోలుకుని డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ తనకు స్వయంగా ఫోన్ చేసి సాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా తమ ఇంటికి వచ్చి వైద్య ఖర్చులతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారని పేర్కొన్నారు.
కళాకారుల పట్ల అలాగే ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని కైకాల సత్య నారాయణ తన లేఖలో వివరించారు. కాగా లేఖపై తాను సంతకం చేయలేకపోవడంతో తన కుమారుడు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని కైకాల సత్య నారాయణ వివరించారు. Kaikala Satyanarayana Praises