మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ ‘మహానటి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రేజ్‌తోనే తను హీరోగా నటించిన మలయాళ మూవీలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుండే సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయింది… మొదటి రోజు స్ట్రైట్ మూవీస్ కన్నా కూడా బెటర్ ఆక్యుపెన్సీ తో రన్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లు సాధించింది
‘కురుప్’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
ఫస్ట్ డే | 0.40 cr |
సెకండ్ డే | 0.41 cr |
థర్డ్ డే | 0.43 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 1.24 cr |
కురుప్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.0.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కేవలం 200 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీ అయితే ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే టైం కి 1.24 కోట్లు షేర్ ను రాబట్టింది. అంటే 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని 49 లక్షల ప్రాఫిట్ ను అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వర్కింగ్ డేస్ లో ఈ మూవీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.