Bright Telangana
Image default

Liger Movie Review : లైగర్ మూవీ రివ్యూ..

liger movie review

Liger Movie Review : ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ స్టామినా ఏమిటో తెలుగు చిత్ర‌సీమ‌కు తెలుసు. త‌న‌దైన రోజున అద్భుతాలు సృష్టించ‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కం ఇప్ప‌టికీ ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా అంతే. కొడితే కుంభ‌స్థ‌లం బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే అనుకునే టైపు. మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లైగర్ మూవీ ఎలా ఉంది? పూర్తి రివ్యూ చదవండి..

ఆల్ మోస్ట్ 3000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా మూవీ పై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ముందుగా కథ విషయానికి వస్తే మార్షల్ ఆర్ట్స్ తో తన కోడుకుని చాంపియన్ లా చూడాలని కరీంనగర్ నుండి ముంబైకి తల్లి కొడుకులు అయిన రమ్యకృష్ణ మరియు విజయ్ దేవరకొండలు వెళతారు. త‌న తండ్రిలా ఫైట‌ర్ కావాల‌ని అనుకుంటుంటాడు. ఎం.ఎం.ఏలో శిక్ష‌ణ ఇప్పించి.. త‌న కొడుకుని ఛాంపియ‌న్‌గా చూడాల‌న్న‌ది తల్లి ఆశ‌.. ఆశ‌యం. టీ కొట్టు పెట్టుకొని కొడుకుని పోషిస్తుంటుంది. అక్కడ తన లక్ష్యం వైపు అడుగులు వేసే హీరో (విజ‌య్ దేవ‌ర‌కొండ) హీరోయిన్ (అన‌న్య పాండే)తో లవ్ లో పడతాడు. తర్వాత ఏం జరిగింది, హీరో ఎలా చాంపియన్ అయ్యాడు. ఇంతకీ మైక్ టైసన్ క్యారెక్టర్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

అతి సాధారణమైన కథని తీసుకుని హీరోకి అస్సలు సెట్ అవ్వని నత్తిని జోడించిన పూరీ ఏ దశలో కూడా డైరెక్టర్ గా తన పవర్ ని చూపించలేదు. హీరో పవర్ ఫుల్ గా ఉన్నా కానీ తన క్యారెక్టర్ తన ఇతర మాస్ హీరోల రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి. కానీ మూవీని నిలబెట్టడానికి విజయ్ దేవరకొండ ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డా కానీ తనకి నత్తి అస్సలు సెట్ కాక పోవడం, లవ్ ట్రాక్ చాలా వీక్ గా ఉండటం, స్టొరీలో అసలు సత్తా లేక పోవడంతో మూవీ కోసం విజయ్ దేవరకొండ పడ్డ కష్టం అంతా వృధా అయింది అని చెప్పాలి. తన రోల్ వరకు తను బాగానే పెర్ఫార్మ్ చేయగా, హీరోయిన్ అనన్య పాండే రోల్ మట్టుకు చిరాకు తెప్పిస్తుంది. ఇక రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్ బాగున్నా ఆ రోల్ చేసే ఓవర్ యాక్షన్ బరించడం కష్టమే. ఇక మైక్ టైసన్ రోల్ మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేదు ఈ మూవీలో.

Vijay Deverakonda LIGER Movie

మ్యూజిక్ విషయానికి వస్తే కంప్లీట్ గా బాలీవుడ్ స్టైల్ లో ఉన్న సాంగ్స్ పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ బాక్సింగ్ నేపధ్యంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా తక్కువే అని చెప్పాలి. ఎడిటింగ్ చాలా వీక్ గా ఉండగా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించాయి.

మొత్తం మీద మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్, తల్లి కొడుకుల మధ్య వచ్చే సీన్స్.. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, లవ్ ట్రాక్, సెకెండ్ ఆఫ్ ఇలా మైనస్ లు చాలానే ఉన్నాయి ఈ మూవీలో..

మొత్తం మీద ఈ మూవీ ఫక్తు మాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు కానీ రీసెంట్ టైం లో ఒకటికి మించి ఒకటి డిఫెరెంట్ నావెల్ స్టొరీ పాయింట్స్ తో వచ్చిన మూవీస్ చూసిన తర్వాత ఇలాంటి కథని యాక్సెప్ట్ చేయడం కష్టమే అని చెప్పాలి. అయినా కానీ ఓపికతో కష్టపడి చూస్తె లైగర్ మూవీ యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు.

మొత్తం మీద మూవీకి మా రేటింగ్ 2.5 స్టార్స్..

Related posts

Vijay Deverakonda Glimpse of LIGER : ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్

Hardworkneverfail

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Maha Samudram: మహా సముద్రం మూవీ రివ్యూ

Hardworkneverfail

‘లైగర్’ కు భారీ నష్టాలు.. పూరి షాకింగ్ డెసిషన్..!

Hardworkneverfail

Anubhavinchu Raja Movie : రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Skylab Movie Review : ‘స్కైలాబ్’ మూవీ రివ్యూ

Hardworkneverfail