Bright Telangana
Image default

వేప చెట్లకు అంతుచిక్కని వింత వ్యాధి..! ఉన్నట్టుండి ఎండిపోతున్న వేపచెట్లు..

వేప చెట్లకు అంతుచిక్కని వింత వ్యాధి

ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి, చిగుర్ల నుంచి ప్రారంభమై వేప చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి. గతంలో కర్ణాటక, రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నిర్జీవంగా మారిన వేప చెట్ల పరిస్థితి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి పాకింది. టీ మస్కిటో బగ్‌ అని కొందరు.. కాదు డై బ్యాక్‌ డిసీజ్‌ వల్ల అని మరికొందరు నిపుణులు చెబుతున్న మాట. ఈ పరిణామంపై లోతుగా వర్సిటీల సమన్వయంతో అటవీ శాఖ విస్తృత పరిశోధనలు చేపట్టాలంటున్నారు నిపుణులు.

రాయలసీమలో కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోనూ వేపచెట్లు ఎండిపోతున్నాయని చెప్తున్నారు. చిగుర్లు, లేత కొమ్మలు, ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి. పొలాలు, బంజరు భూముల్లోనే కాకుండా.. బెంగళూరు, హైదరాబాద్, అనంతపురం వంటి నగర, పట్టణ ప్రాంతాల్లోనూ వేప చెట్లు చనిపోతున్నాయి. దీనికి పలు కారణాలు చెబుతున్నారు ఉస్మానియా యూనివర్శిటీ ఎన్‌వీరాన్‌మెంట్‌ ప్రొఫెసర్లు. వేప చెట్లకి డై బ్యాక్ డీసీజ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లే పురుగు పట్టడం, ఎండుతున్నట్లు కనిపించడం, రంగు మారినట్లు చెప్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంవిరాన్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెస్సార్ శశికళ … ‘టీ మస్కిటో బగ్‌’ అనే పురుగు ఆశించడం వల్ల సుడి భాగం క్రమంగా రెమ్మలు, కొమ్మలు, కాండం ఎండిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుందని తెలిపారు.

Related posts

TRS: కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ధర్నాలు

Hardworkneverfail

సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇస్తాం: మంత్రి హరీష్ రావు

Hardworkneverfail

మరో పిడుగులాంటి వార్త.. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం!

Hardworkneverfail

Bus Fare Hike: తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు.. పెరిగినా చార్జీలు జూన్ 9 నుండి అమలు

Hardworkneverfail

Revanth Reddy: కలెక్టర్లు బానిసలంటూ ఆగ్రహం…రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

Hardworkneverfail

Omicron cases in AP : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఓమిక్రాన్ కేసులు

Hardworkneverfail