Bright Telangana
Image default

New Telugu Movies Ott Release : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు మూవీస్ లిస్ట్ ..

Telugu Movies Ott Release

New Telugu Movies Ott Release : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు మూవీస్ పైనా ఒక లుక్ వెయ్యండి ..

Akhanda Movie OTT : గత ఏడాది డిసెంబర్‌లో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న మూవీ ‘అఖండ’. ఇప్పుడు ఈ మూవీ (Akhanda Movie) ఓటీటీలో సందడి చేస్తుంది. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ మూవీ కూడా గత నెలలోనే రిలీజై భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. 100కు పైగా థియేటర్స్‌లో ఈ మూవీ విజయవంతంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. కాగా, ఈ మూవీ జనవరి 21 శుక్రవారం నుంచి డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Akhanda and Shyam Singha Roy Movies on OTT

Shyam Singha Roy Movie on OTT : ఇక టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ గత నెల డిసెంబర్‌ 24న తెలుగు, తమిళ, కన్నడం మరియు మలయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ జనవరి 21 శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజై భారీ హిట్ సాధించిన ‘అఖండ’ మరియు ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీస్ ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Arjuna Phalguna Movie ott platform

Arjuna Phalguna Movie OTT : శ్రీవిష్ణు హీరోగా, అమృత అయ్యర్‌ హీరోయిన్ గా నటించిన ‘అర్జున ఫల్గుణ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. డిసెంబర్ 31, 2021న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సక్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక అది అలా ఉంటే ‘అర్జున ఫల్గుణ’ మూవీ ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. ఈ మూవీని రిపబ్లిక్ డే రోజు (జనవరి 26, 2022) నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన పోస్టరును ట్విట్టర్ లో రిలీజ్ చేశారు ఆహా మేకర్స్. మ్యాట్సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ మూవీని నిర్మించగా.. తేజ మర్ని దర్శకత్వం వహించారు ఈ మూవీకి. 

Pushpa Movie Ott on amazon

Pushpa Movie Ott Release Update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప ది రైజ్’ మూడో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప రాజ్ వరల్డ్ వైడ్ గా 360 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని దాటేసి 40 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకు పోతుంది. ఇకపొతే ఓటీటీలోనూ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో దూసుకు పోతుంది.

‘పుష్ప’ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 17న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళం భాషల్లో విడుదలైన ఈ మూవీ జనవరి 7న రాత్రి 8 గంట‌ల నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

skylab ott sony liv

SkyLab Movie OTT Release Date : టాలీవుడ్ హీరో సత్యదేవ్, హీరోయిన్ నిత్యామీనన్ మరియు రాహుల్ రామకృష్ణన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ స్కైలాబ్. కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. పిరియాడికల్ డ్రామాగా 2021, డిసెంబర్ 4న విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకొంది. ఇక ఈ మూవీ ఎప్పుడో ఓటిటీ లో రావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఓటిటీ లోకి అడుగు పెట్టింది. భారీ ధరకు స్కైలాబ్ మూవీని సోని లివ్ ఓటీటీ వారు తెలుగు లో స్ట్రీమింగ్ చేసేందుకు గాను మూవీ డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నారు. జనవరి 14 నుండి స్కైలాబ్ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీ నిత్యామీనన్ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. జనవరి 14 నుండి స్కైలాబ్ మూవీ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఓటిటీ లో కూడా దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.

lakshya movie released on january 7th

Lakshya OTT on Aha : నాగశౌర్య హీరోగా నటించిన మూవీ లక్ష్య. నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించారు ఈ మూవీలో. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొట్టాడు. ఈ మూవీకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 10న విడుదల అయిన ‘లక్ష్య’ మూవీకి యవరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా నమోదవడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.

ఇక అది అలా ఉంటే లక్ష్య మూవీ ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. లక్ష్య మూవీ జనవరి 7 నుండి ఆహా వీడియోలో స్ట్రీమింగ్  అవుతుంది.

Konda Polam OTT

Konda Polam Movie OTT : వైష్ణవ్ తేజ్ హీరోగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కొండపొలం’. జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై నిర్మించిన ‘కొండపొలం’ మూవీ అక్టోబర్ 8న విడుదలయ్యింది. మార్నింగ్ షో తోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ మూవీ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆశించిన రీతిలో ఈ మూవీ ఫలితం సాధించడంలో విఫలమైంది. ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.3.90 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

ఇక అది అలా ఉంటే ‘కొండపొలం’ మూవీ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కొండపొలం’ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related posts

Acharya Movie : ‘ఆచార్య’ మూవీ ఓటిటి డీల్ క్లోజ్..!

Hardworkneverfail

Unstoppable With NBK : బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో మహేశ్ బాబు..!

Hardworkneverfail

Drushyam 2 : ఆకట్టుకుంటున్న వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీ టీజర్‌..

Hardworkneverfail

Unstoppable With NBK : ‘అన్ స్టాపబుల్ షో’లో విజయ్ దేవరకొండ ‘లైగర్’ టీమ్ సందడి

Hardworkneverfail

Unstoppable with NBK : విభేదాలకు తెరదించిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో .. ఆహలో రెట్టింపైన ఆహ్లాదం

Hardworkneverfail

Lakshya OTT Release : ‘లక్ష్య’ మూవీ ఓటిటిలో ఎప్పుడంటే..?

Hardworkneverfail