Bright Telangana
Image default

Power of Ghani Special Glimpse : వరుణ్‌తేజ్ గని నుంచి స్పెషల్ గ్లింప్స్

Power of Ghani Special Glimpse

Power of Ghani Special Glimpse : మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా మూవీ యూనిట్ ‘పవర్ ఆఫ్ గని’ గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో సునీల్ శెట్టి.. వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో కోచింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కొంత మంది మాత్రం యోధులుగా తయారవుతారు.. కానీ గని యోధుడిగా పుట్టాడు అని ఈ పవర్ ప్యాక్డ్ గ్లింప్స్ కు క్యాప్షన్ ఇచ్చారు.

వరుణ్‌తేజ్ గని మూవీ ద్వారా కిరణ్ కొర్రపాటి అనే దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కరోనా వల్ల వాయిదా పడిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.Power of Ghani

Related posts

వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

Hardworkneverfail

Ghani Teaser: ఆట ఆడిన ఓడిన రికార్డ్స్ లో ఉంటావు..కాని గెలిస్తేనే చరిత్రలో ఉంటావు

Hardworkneverfail

Ghani: నేడే వరుణ తేజ్‌ ‘గని” టీజర్‌..టీజర్ లో చరణ్ వాయిస్ ఓవర్..!

Hardworkneverfail

Ghani: వీళ్లే ‘గని’ ప్రపంచం.. టీజర్‌ ఎప్పుడంటే..!

Hardworkneverfail