Bright Telangana
Image default

RRR Movie Review : ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీ రివ్యూ

rrr movie review

RRR Movie Review : ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ రోజు రానే వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ థియేటర్లలోకి అడుగు పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లాంటి ఇద్దరు టాప్ హీరోల కలయికలో రాజమౌళి తీసిన ఈ మూవీపై అంచనాలు అలా ఇలా లేవు. మరి ఈ మూవీ ఆ అంచనాలను ఏమేర అందుకుంది.. రాజమౌళి మరోసారి వెండితెరపై మాయాజాలం చేశాడా.. అన్న విషయాలు తెలుసుకుందాం పదండీ.

ముందుగా కథ విషయానికి వస్తే.. నిజాం రాజుని కలవడానికి వచ్చిన బ్రిటిష్ దొర గోండ్ల పిల్లను బలవంతంగా తీసుకెళతాడు. ఈ విషయం తెలుసుకున్న కొమరం భీమ్ (జూనియర్ ఎన్టీఆర్ ) ఆ పిల్లను రక్షించే క్రమంలో తనని పట్టుకోవాల్సిన భాధ్యతని సీతారామరాజు (రామ్ చరణ్)కి అప్పగించడం జరుగుతుంది, కానీ ఇద్దరూ స్నేహితులు అవుతారు. ఆ తర్వాత అనుకోని సంఘటనల వలన గొడవ పడాల్సి వస్తుంది, ఇక ఆ తర్వాత ఈ ఇద్దరూ తిరిగి ఎలా కలిశారు, బ్రిటీష్ వాళ్ళ పై ఎలా పోరాడారు అన్నది అసలు కథ, ఈ కథ ఆలియా భట్, అజయ్ దేవగన్ లు ఎలా హెల్ప్ అయ్యారు అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

రాజమౌళి మూవీలో కథ కన్నా కూడా కథని చెప్పిన విధానం ఎప్పుడూ బాగుంటుంది, ఇక్కడ కూడా అదే జరిగింది, అనుకున్న కథ మాములుగానే ఉంటుంది, కానీ ఆ కథని ఆడియన్స్ కి నచ్చేలా చెప్పే విధానం, ఎక్కడ హై మూమెంట్స్ పడాలి, ఎక్కడ మూవీ స్లో అవ్వాలి, మళ్ళీ ఎక్కడ హై పాయింట్స్ రావాలి, ఎక్కడ ఎమోషనల్ సన్నివేశాలు పడాలి. ఇలా అన్నింటిని పెర్ఫెక్ట్ గా లెక్కలు వేసుకుని జక్కన్న మూవీని చెక్కే విధానం ఆయన బిగ్గెస్ట్ సక్సెస్ ఫార్ములా. ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇద్దరు హీరోల నుండి ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ ఎలాంటి హై ఇంట్రో ని ఊహించుకుంటారో అలాంటి ఇంట్రో ఇచ్చి ఇద్దరి స్నేహాన్ని ఆకట్టుకునే విధంగా సాంగ్ లో ప్రజెంట్ చేసి కథని మెల్లిమెల్లిగా ముందుకు నడుపుతూ మళ్ళీ ఓ హై మూమెంట్ ఉండాలి కాబట్టి నాటు నాటు సాంగ్ తో థియేటర్స్ దద్దరిల్లిపోయేలా ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ తో ఊరమాస్ స్టెప్స్ వేయించి మెప్పించి తర్వాత కొన్ని ఎలివేట్ సీన్స్ ని ఎన్టీఆర్ కి మరియు కొన్ని ఎలివేట్ సీన్స్ రామ్ చరణ్ కి బాలెన్స్ చేస్తూ తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు.

rrr movie telugu states business details

ఫస్టాఫ్ వరకు ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువ అనిపించింది మరియు రామ్ చరణ్ పాత్ర కి ఫస్ట్ నుండి ఓ బ్యాగ్ డ్రాప్ స్టొరీ ని పెట్టి దాన్ని బిల్డ్ చేస్తూ సెకెండ్ ఆఫ్ లో ఫెంటాస్టిక్ ట్రాన్స్ ఫార్మేషన్ సీన్ తో ఊహకందని రేంజ్ లో ఎలివేట్ చేశాడు. ఇక ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పోరాటాలు, యాక్టింగ్ లు సూపర్బ్ గా ఉన్నాయి అని చెప్పాలి. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా డిఫెరెంట్ గా ప్లాన్ చేశాడురాజమౌళి. క్లైమాక్స్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి. ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ పరంగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరూ ఆదరగోట్టేశారు, ఇక హీరోయిజం సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఇద్దరివీ కూడా చాలా బాగా ఆకట్టుకోగా ఫస్టాఫ్ ఎన్టీఆర్ హైలెట్ అయితే సెకెండ్ ఆఫ్ లో రామ్ చరణ్ హైలెట్ అవుతాడు అని చెప్పాలి. ఇక ఆలియా భట్ మరియు ఒలివియా రోల్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అజయ్ దేవగన్ మరియు శ్రియ ఫ్లాష్ బ్యాక్ లో పర్వాలేదు అనిపించుకోగా, సముద్రఖని మరియు ఇతర తారాగణంకి పెద్దగా స్కోప్ లేదు కానీ పర్వాలేదు.

రాజమౌళి ఇతర మూవీస్ తో పోల్చితే ఈ మూవీలో మ్యూజిక్ వీక్ గా ఉంది అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. కానీ విజువల్స్ పరంగా రాజమౌళి బాలెన్స్ చేసి ఆ సాంగ్స్ ని స్కిప్ చేయకుండా తన మ్యాజిక్ చూపించాడు, కానీ కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో ఏమాత్రం తీసిపోని బ్యాగ్రౌండ్ స్కోర్ తో రెచ్చిపోయాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ ఫెంటాస్టిక్ గా ఉన్నప్పటికీ సెకెండ్ ఆఫ్ లో కొంచం స్లో అయినట్లు అనిపించింది, సినిమాటోగ్రఫీ ఫెంటాస్టిక్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి కానీ కొన్ని గ్రాఫిక్స్ షాట్స్ నాసికరంగా అనిపించాయి. ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ హైలెట్స్ విషయానికి వస్తే ఇద్దరు హీరోల ఇంట్రోలు, నాటు నాటు సాంగ్, ఇద్దరు హీరోల ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్, గూస్ బంప్స్ ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఇలా చాలానే హైలెట్స్ ఉన్నాయి మూవీలో. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకెండ్ ఆఫ్ స్లో అవ్వడం, లెంత్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపించడం లాంటివి చిన్న మైనస్ పాయింట్స్ అని చెప్పాలి.

మొత్తం మీద ఆర్ఆర్ఆర్ మూవీ(RRR Movie) అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం కచ్చితంగా అంచనాలను అందుకోవడం కాదు కొన్ని సీన్స్ వరకు అయితే అంచనాలను మించిపోతుంది అని చెప్పాలి. మొత్తం మీద భారీ ఎక్స్ పెర్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ఆ ఎక్స్ పెర్టేషన్స్ కి ఏమాత్రం మూవీ తీసిపోలేదు అన్న ఫీలింగ్ తో థియేటర్ బయటికి రావడం ఖాయం.

మొత్తం మీద ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie)కి మా రేటింగ్ 4 స్టార్స్ ..

Related posts

Acharya Movie Postponed : ‘ఆచార్య’ విడుదల వాయిదా..

Hardworkneverfail

RRR Movie 1st Day Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్.. బాహుబలి 2 మూవీ రికార్డ్ బ్రేక్

Hardworkneverfail

RRR Movie Promotions : సల్మాన్ ఖాన్ తో నాచో నాచో స్టెప్స్ వేయించిన చరణ్, ఎన్టీఆర్

Hardworkneverfail

Jr NTR: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో కోటి రూపాయల ప్రశ్న ఏంటో మీకు తెలుసా..?

Hardworkneverfail

RRR Movie Press Meet : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రెస్ మీట్

Hardworkneverfail

RRR Day 9 Collections : 9 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్.. ఊరమాస్ అనిపించేలా కలెక్షన్స్

Hardworkneverfail