Bright Telangana
Image default

RRR Movie TRP Rating : టాప్ 10 లో లేని మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ

rrr movie trp

RRR Movie TRP Rating : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ పై ఎలాంటి అంచనాలు ఆడియన్స్ లో ఉన్నాయో ఆ అంచనాలను నిజం చేస్తూ టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ మూవీ కూడా అనుకోని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూవీ ఆర్ ఆర్ ఆర్. 

ఈ మూవీ థియేట్రికల్ రిజల్ట్ కి ఏమాత్రం తీసి పోనీ విధంగా డిజిటల్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, డిజిటల్ లో వరల్డ్ వైడ్ గా ఊహకందని రీచ్ ని దక్కించుకున్న ఈ మూవీ ఆల్ మోస్ట్ అన్ని మేజర్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవ్వగా అన్ని చోట్లా దుమ్ము రేపింది. ఇండియన్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ మూవీ ఆకట్టుకుంది. తర్వాత టెలివిజన్ లో మొదటి సారిగా రీసెంట్ గా టెలికాస్ట్ అయింది ఈ మూవీ.

rrr 8 days collections

ఇదిలా ఉంటే ఇటీవల ఈ మూవీ శాటిలైట్ లో ప్రసారం అయింది. టెలివిజన్ లో సైతం రికార్డులను క్రియేట్ చేస్తుందని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. స్టార్ మాలో తెలుగు వెర్షన్ తొలిసారి ప్రసారం చేయగా మంచి రేటింగ్ అందుకుంది. కానీ అందరూ ఎదురు చూసిన విధంగా రికార్డులను క్రియేట్ చేయలేకపోయింది. టెలికాస్ట్ అయినప్పుడు 19.62 TRP రేటింగ్ ను సొంతం చేసుకోగా స్టార్ మా చానెల్ HD మరియు నార్మల్ వర్షన్స్ కలిపి 22.5 రేంజ్ లో రేటింగ్ ను సాధించింది. కొత్త రికార్డులు నమోదు అవుతాయి అనుకున్నా కానీ అలాంటిది ఏమి జరగలేదు సరికదా ఆశ్చర్యకరంగా టాప్ టెన్ లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చోటు దక్కించుకోలేక పోవడం విశేషం.

ఇక ఇప్పటికీ అల్లు అర్జున్ నటించిన ‘అల..వైకుంఠపురములో’ మూవీ 29.4 TRP తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు 23.4 TRP తో రెండో స్థానంలోను, బాహుబలి సెకండ్ పార్ట్ 22.7తో మూడో ప్లేస్ లో, శ్రీమంతుడు 22.54 TRP తో నాలుగో ప్లేస్ లో పుష్ప 22.54 పాయింట్స్ తో ఐదో స్థానంలో, డీజే 21.7 TRP తో ఆరో ప్లేస్ లో, బాహుబలి ఫస్ట్ పార్ట్ 21.54 తో ఏడో స్థానంలో, ఫిదా 21.31 TRP తో ఎనిమితో ప్లేస్ లో, గీతగోవిందం 20.8 TRP తో తొమ్మిదో స్థానంలో, జనతా గ్యారేజ్ 20.69 TRP తో పదో ప్లేస్ లో నిలిచాయి. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మాత్రం టాప్ టెన్ లో ప్లేస్ చేజిక్కించుకోలేక పోయింది. ఓటీటీ లో ఈ మూవీని ఇప్పటికే ఒకటికి రెండు చూసి ఉండటమే అందుకు కారణమని భావిస్తున్నారు. దాంతో శాటిలైట్ పై ఓటీటీ అంతలా ప్రభావం చూపించిందన్న మాట వాస్తవం..

Related posts

RRR Movie First Day Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ 200 కోట్లు ?

Hardworkneverfail

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Hardworkneverfail

RRR Movie : విజువల్ వండర్.. అంచనాలను ఆకాశానికి చేర్చిన ఫస్ట్ గ్లింప్స్..

Hardworkneverfail

The Kapil Sharma Show : ‘ది కపిల్ శర్మ షో’ లో RRR మూవీ టీమ్ సందడి

Hardworkneverfail

RRR Movie OTT Release : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే…?

Hardworkneverfail

RRR Pre Release Event : రామ్ చరణ్, ఎన్టీఆర్ రెండు ఫిరంగుల్లాంటి వారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి

Hardworkneverfail