సిద్దార్థ్, శర్వానంద్ లు హీరోలుగా రూపొందిన మూవీ ‘మహా సముద్రం’. అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ మూవీ విడుదల అయ్యింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా పడిపోయాయి. దీంతో మొదటివారానికే ఈ మూవీనీ చాలా థియేటర్స్ నుండీ తొలగించడం జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.7.07 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.దీంతో బయ్యర్లకు రూ.10 కోట్ల వరకు నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది.
ఇక అది అలా ఉంటే ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మహా సముద్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతోంది. నెట్ ఫిక్ల్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను దాదాపు పదకొండు కోట్లకు కొన్నట్లు సమాచారం.