Tax on Garbage in Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్నుకు సంబంధించి కొన్ని నెలల క్రితమే కొత్త జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపుదల పద్ధతి ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అదే సమయంలో చెత్త సేకరణకు కూడా పన్ను వసూలు చేస్తుంది. ఇప్పటికే మునిసిపాలిటీలలో దానికి అనుగుణంగా తీర్మానాలు కూడా చేశారు.
ఈ నిర్ణయాల పట్ల కొన్ని వర్గాలు ఆందోళన చేశాయి కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది పెద్ద భారం కాబోదని చెబుతూ వస్తుంది. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు విధించడమంటే ప్రతి సంవత్సరం ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లే అవుతుందని చెబుతున్నారు.
‘స్థలాలు, ఇళ్లు మరియు అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తున్నప్పుడు విలువల ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డ్యూటీ మరియు ఫీజులు వసూలు చేస్తోంది. చెత్త మీద పన్ను వేయడం చాలా చెత్త నిర్ణయం అని దీనిని ఉపసంహరించుకోవాలి ప్రజలు మరియు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో కూడా ఇలాంటి ఆలోచనలు వచ్చినా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిర్ణయం ఉపసంహరించారు. కానీ ఇప్పుడు ఏడాదికి రూ. 750 నుంచి రూ 1500 వరకూ ఆయా మునిసిపాలిటీలు, కార్పోరేషన్లలో చెత్త సేకరణ పన్ను వేస్తున్నారు‘ అని అంటున్నారు అక్కడి ప్రజా ప్రతినిధులు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.