Valimai Movie Trailer : అజిత్ టైటిల్ రోల్‌లో తెరకెక్కుతున్న ‘వాలిమై’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీకి స్క్రిప్ట్ రాసి దర్శకత్వం వహించారు హెచ్ వినోత్. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
బాలీవుడ్ భామ హైమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు ఈ పూర్తి స్థాయి యాక్షన్ మూవీలో. అజిత్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందించారు. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 13 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.