Varudu Kavalenu Movie OTT Release Date Announced : నాగశౌర్య, రీతూ వర్మ జంటగా కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపొందించిన మూవీ ‘వరుడు కావలెను’. అక్టోబర్ 29న విడుదల అయింది ఈ మూవీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కిన ఈ మూవీ మంచి టాక్ ను రాబట్టుకున్నప్పటికీ ఎందుకో కలెక్షన్లు మాత్రం రాలేదు. దీంతో ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.5.12 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.3.47 కోట్ల నష్టం వాటిలింది.
ప్రేమ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ తెరకెక్కింది. ‘వరుడు కావలెను’ మూవీ డిజిటల్ రైట్స్ ను జీ5 సంస్థ వారు సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. 2022 జనవరి 7 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 వెల్లడించింది.