తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్న వారి హృదయాల్లో చెరగని స్థానాన్నిదక్కించుకుంది ఆహా. హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధమ్యంగా దూసుకుపోతుంది ఆహా. ఇందులో సరికొత్త ఎగ్జయిటింగ్ వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ ఆడియెన్స్‌ను అలరించనుంది. భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే, ఈరోజుల్లో, మహానుభావుడు వంటి సూపర్ డూపర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఈ సిరీస్‌కు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ మాధ్యమంలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తోన్న తొలి వెబ్ సిరీస్ ఇదే. రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. విజయ్ దేవకొండ ట్యాక్సీవాలా చిత్రాన్ని నిర్మించిన ఎస్.కె.ఎన్ యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ‘3 రోజెస్’ మూవీని నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్స్ బార్లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌కు బ్లూమింగ్ సూన్ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. ఇందులో నటించే ముగ్గురు హీరోయిన్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది.
Happy to present you the FIRST EVER on web, 3 Roses🌹 from my team on @ahavideoIN being produced by my bestie @SKNonline
— Director Maruthi (@DirectorMaruthi) October 1, 2021
Meanwhile,get your guesses rolling on who these ladies are. 👩🏻🦰👩🏻🦰👩🏻🦰@maggifilmmaker #Rose1 #Rose2 #Rose3#3RosesOnAHA #BloomingSoon #StayTuned #GuessTheLadies pic.twitter.com/mqo5F3kgGb