సిద్దార్థ్, శర్వానంద్ లు హీరోలుగా రూపొందిన మూవీ ‘మహా సముద్రం’. అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ మూవీ విడుదల అయ్యింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ఈ మూవీ కలెక్షన్లు రెండో రోజు దారుణంగా పడిపోయాయి. మూవీ మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టగా రెండో రోజు నుండి పోటి తట్టుకోలేక పోయింది. మూడో రోజు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ చాలా తక్కువ షేర్ ని సొంతం చేసుకుంది. బ్రేక్ ఈవెన్ దృశ్యా ఇవి సరిపోవు అనే చెప్పాలి.
మహా సముద్రం మూవీ 3 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చిన షేర్ :
నైజాం | 1.58 cr |
ఉత్తరాంధ్ర | 0.61 cr |
సీడెడ్ | 0.90 cr |
ఈస్ట్ | 0.36 cr |
వెస్ట్ | 0.29 cr |
గుంటూరు | 0.60 cr |
నెల్లూరు | 0.26 cr |
కృష్ణా | 0.38 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 4.98 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.52 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 5.50 cr |
‘మహా సముద్రం’ మూవీకి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.5.50 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.11 కోట్ల పైనే షేర్ ను రాబట్టాలి.