టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లక్ష్య. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.. ఈ మూవీలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొడుతున్నారు. ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది.
ఇక ఈ మూవీ కోసం నాగశౌర్య చేసిన బాడీ మేకోవర్ మంచి హైప్ ను క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే… ఈ మూవీ మొత్తం ఆర్చరీ చుట్టూనే తిరుగుతున్నట్లు కనబడుతోంది. విజువల్స్ బాగున్నాయి. దీనికితోడు కాల భైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.
సృజనమణి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ‘వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు .. నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావ్ .. ఇద్దరూ ఒకటేగా’ .. ‘పడి లేచినవాడితో పందెం చాలా ప్రమాదకరం’.. ‘నేను వందమందికి నచ్చక్కరలేదు సార్ .. కానీ నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దనుకుంటే ఇక నేను గెలిచేది దేనికి సార్’ వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఈ మూవీ డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.