తమిళంతో పాటు, తెలుగులోనూ గుర్తింపు ఉన్న నటుడు శివకార్తికేయన్. గత కొంతకాలంగా ఆయన నటించిన మూవీలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ఆయన కీలక పాత్రలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వరుణ్ డాక్టర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. దీపావళి కానుకగా నవంబరు 4న సాయంత్రం 6.30 గంటలకు సన్ టీవీలో ఈ మూవీ ప్రదర్శించనున్నారు. అదే రోజు నెట్‌ఫ్లిక్స్, సన్‌నెక్ట్స్ ఓటీటీల వేదికగా ‘వరుణ్ డాక్టర్’ స్ట్రీమింగ్ కానుంది.