స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మార్టిన్ గప్తిల్(56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి ఓటమిపాలైంది.
మైఖేల్ లీస్క్(20 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జార్జ్ మున్సే(18 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మ్యాథ్యూ క్రాస్(29 బంతుల్లో 27; 5 ఫోర్లు) స్కాట్లాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు దక్కించుకోగా టిమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మార్టిన్ గప్తిల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.