బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, షణ్ముఖ్ మధ్య ఫైట్ నడుస్తోంది. గత రెండు రోజులుగా వీరి మధ్యనున్న మనస్పర్థలు, గొడవలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. షణ్ముఖ్ స్నేహితుడిగా తనకు సపోర్ట్ చేయాల్సినవాడే జెన్యూన్‌గా ఆడలేదని విమర్శించడం, అందరి ముందే తనను దారుణంగా నిందించడం, కావాలని గొడవ చేయడం వంటి విషయాలను తట్టుకోలేకపోయింది సిరి. మరోసారి ఏడ్చేస్తూ షణ్నుకు మీద అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు, వాడికి ఫ్రెండ్షిప్ విలువ తెలిస్తే కదా! అంతా ఫేక్, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా ఉంటున్నాడు. నా ఫ్రెండ్షిప్కు వాల్యూ లేకుండా అయిపోయింది’ అంటూ భోరుమని ఏడ్చేసింది. మరి షణ్ముఖ్ ఈ పరిస్థితిని ఎలా డీల్ చేస్తాడో చూడాలి! మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.