సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. అపోలో ఆస్పత్రిలో గత రెండ్రోజులుగా చికిత్స పొందుతున్నారు. తాజాగా అపోలో వైద్యులు కైకాల హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారని.. ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదని చెప్పుకొచ్చారు. వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. కైకాల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతోంది. బీపీ లెవల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందంటూ ఓ ప్రకటన విడుదల చేసారు అపోలో వైద్యులు.
60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల సత్యనారాయణ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 మూవీస్ ల్లో నటించి.. తెలుగు అభిమానులను అలరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు.