ప్రస్తుతం ఏదైనా భాషలో మూవీ హిట్టైయితే.. వెంటనే ఆయా మూవీలను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలో హిట్టైన మూవీస్ ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే పలు మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. ఈ కోవలో తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ మూవీని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసారు. ఈ మూవీలో షాహిద్ కపూర్ క్రికెటర్ పాత్రలో అదరగొట్టారు.
ఈయన తెలుగులో హిట్టైన ‘అర్జున్ రెడ్డి’ మూవీని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు షాహిద్ కపూర్. ఇక ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండను స్టార్ హీరోని చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసిన సందీప్ వంగా పేరు దేశం యావత్తు మారుమోగింది.