న్యాచులర్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ . నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ మూవీలో నాని చేస్తున్న వాసు క్యారెక్టర్ మోషన్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుండడం.. ముగ్గురు హీరోయిన్లు ఉండడంతో మూవీ మీద అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ రేటుకే అమ్ముడుపోయాయి. తాజాగా ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్లకు B4U ఛానెల్ దక్కించుకుంది. మొత్తంగా నాని నటించిన హిందీ మూవీలకు మంచి గిరాకీ ఉంది. ఈ కోవలో ఈ మూవీకు ఈ రేంజ్ రేటు పలికిందని చెబుతున్నారు.
డిసెంబర్ 24న మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకు హిందీ డబ్బింగ్ టీవీలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.