సందీప్ కిషన్ హీరోగా నటించిన మూవీ ‘గల్లీ రౌడీ’. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంస్థలు నిర్మించాయి. నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు.