నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో రానున్న మూడో మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్టేగా మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు దీపావళి తరువాత మరో పండుగను అందించారు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్య సందడితో షేక్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. అఖండ
డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మూవీకి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీలోని గ్రాండ్ విజువల్స్, డ్రామాను చూసి సెన్సార్ సభ్యులు మూవీ యూనిట్ ప్రశంసించారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో శిల్పకళ వేదికలో ఘనంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరు కానున్నారు. బోయపాటి శ్రీను తెరకేకించిన సరైనోడు మూవీలో అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలకృష్ణ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ రానున్నారని తెలియడంతో ఇటు నందమూరి ఫ్యాన్స్ కి అటు మెగా ఫ్యాన్స్ కి మాత్రం కిక్కునిస్తుంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్ కార్యక్రమాన్ని ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించవచ్చు..
ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..