నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘బింబిసార’. ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్.. అన్న క్యాప్షన్‌తో వశిష్ట్ దర్శకత్వంలో ఈ మూవీ వస్తుంది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన మూవీ ఇది. ఎలాంటి హడావిడి లేకుండా కళ్యాణ్ రామ్ ఈ మూవీ షూటింగును పూర్తిచేశాడు.
ఈ మూవీలో కేథరీన్, సంయుక్త మేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇందులోని విజువల్స్, వాయిస్ ఓవర్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎలివేషన్ షాట్స్ అయితే అద్భుతం. ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే.. పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది అంటూ వాయిస్ ఓవర్‌తో సాగిన టీజర్ ఆకట్టుకుంది.
రాజ మందిరంలోని చిన్న నీటి కొలనులో ఉన్న మొసలిపైనుంచి నడుచుకుంటూ బింబిసారుడు వెళ్లే సీన్ టీజర్ మొత్తానికి హైలైట్. బింబిసార టీజర్.. హై ఓల్టేజ్‌లో కళ్యాణ్ రామ్ లుక్స్ గతంలో ఏ మూవీలో లేనట్లుగా ఉన్నాయి. బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు కళ్యాణ్ రామ్. ఈ షాట్స్ అన్నీ చూస్తుంటే మూవీ మరో స్థాయిలో ఉండబోతుందని అర్థమవుతుంది.