Lakshya OTT Release on Aha : నాగశౌర్య హీరోగా నటించిన మూవీ లక్ష్య. నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించారు ఈ మూవీలో. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొట్టాడు. ఈ మూవీకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 10న విడుదల అయిన ‘లక్ష్య’ మూవీకి యవరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా నమోదవడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.
ఇక అది అలా ఉంటే ‘లక్ష్య’ మూవీ ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. ‘లక్ష్య’ మూవీ జనవరి 7 వ తేదీన ఆహా వీడియోలో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించింది. దాంతో స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గమనమా, గమ్యమా? ఏది ముఖ్యం? Watch sports action drama #Lakshya Jan 7 on aha.@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/3xCb5pFrax
— ahavideoIN (@ahavideoIN) December 27, 2021