Acharya Movie New Release Date Announced : కోవిడ్-19 మహమ్మారి కారణంగా చిరంజీవి ‘ఆచార్య’ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నామని, కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మూవీ యూనిట్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ రోజు కొత్త విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ మూవీని ఉగాది పండుగ రోజు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1 ఆచార్య మూవీ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ తెలిపారు. మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ కూడా ఏప్రిల్ 1, 2022న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.. కానీ ఈ మూవీ ఆగస్టు కు వాయిదా పడినట్లు తెలుస్తోంది.Acharya Movie New
‘ఆచార్య’ మూవీని కొరటాల శివ దర్శకత్వం వహించగా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు ఈ మూవీలో మరియు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన మూడు సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
This Ugadi, Witness the MEGA MASS on big screens 💥💥#Acharya Grand Release on April 1 🔥#AcharyaOnApril1
— Konidela Pro Company (@KonidelaPro) January 16, 2022
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/DwnYRcakcd