Bright Telangana
Image default

AP Weather Alert: మరో 24 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం..

Apలో మరో 24 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాలతో పాటు కొన్ని పరీవాహక ప్రాంతాల్లో మరో 24గంటల పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారతదేశం వాతావరణ విభాగం హెచ్చరించింది. బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచె త్తుతుంది. నేడు తుఫాన్‌ తీరం దాటనున్న నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలె వరూ ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక తుఫాన్‌ కొద్ది సేపట్లో తమిళ నాడులోని కరైకల్‌, ఏపీలోని శ్రీహరి కోట వద్ద ఉన్న కడలూరులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఈ వాయుగుండం వల్ల తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ జన జీవనం అస్తవ్యస్తం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కీలోమీటర్ల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తమిళ నాడు, ఏపీలోని తిరుపతిలో భారీ వర్షం పడుతోంది. ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Related posts

వేప చెట్లకు అంతుచిక్కని వింత వ్యాధి..! ఉన్నట్టుండి ఎండిపోతున్న వేపచెట్లు..

Hardworkneverfail

Heavy Rains: మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షసూచన

Hardworkneverfail

AP Weather Alert: ఏపీని ముంచేస్తున్న భారీ వర్షాలు..ఆ ప్రాంతాల్లో హైఅలెర్ట్

Hardworkneverfail

Omicron cases in AP : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఓమిక్రాన్ కేసులు

Hardworkneverfail

Pawan Kalyan : నేటి నుంచి జనసేనాని విశాఖలో పర్యటన… స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంలో పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Kolleru: మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో ఉన్న నాటుసారా స్థావరాల్ని ధ్వంసం చేసిన ఎస్పీ

Hardworkneverfail