కొల్లేరు సరస్సు లో నాటుసారా స్థావరాలను ధ్వంసం చేయడానికి కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ స్వయంగా రంగంలోకి దిగారు. కొల్లేరులో నిర్మానుష్య ప్రాంతాలు ప్రయాణానికి అనుకూలంగాలేని రహస్య ప్రాంతాల్లో నాటు పడవ పై వెళ్లారు. పందిరిపల్లి గ్రామ పరిధిలో ఉన్న కొల్లేరులో గుడివాడ డిఎస్పీ సత్యానందం సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. కనిపించకుండా ముళ్లపొదల్లో ఉన్నా నాటుసారా స్థావరాలను ఎస్పీ పోలీస్ సిబ్బంది ధ్వంసం చేశారు. డ్రోన్ కెమెరా సహాయంతో ఇలాంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయేమో అని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఈ దాడుల్లో రెండు నాటు పడవలు, మోటార్లు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీగా నాటుసారాను ధ్వంసం చేశారు, నాటుసారా ను తయారు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.