Bright Telangana
Image default

AP Weather Alert: ఏపీలో నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు..

AP Weather Alert

తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ : తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 29 నాటికి దక్షిణ అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందన్నారు. ఈశాన్య భారతదేశం వైపు నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వస్తుండడంతో నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.

Related posts

Chandrababu: మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు..

Hardworkneverfail

అతి భారీ వర్షాలతో అతలాకుతలమైన నిజామాబాద్‌ జిల్లా

Hardworkneverfail

Pawan Kalyan : ఇంగిత జ్ఞానం ఉందా ? ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

Hardworkneverfail

AP Weather Alert: ఏపీని ముంచేస్తున్న భారీ వర్షాలు..ఆ ప్రాంతాల్లో హైఅలెర్ట్

Hardworkneverfail

మరో పిడుగులాంటి వార్త.. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం!

Hardworkneverfail

తాజా ఫలితాలతో నైనా చంద్రబాబు మారాలి : ఏపీ సీఎం జగన్

Hardworkneverfail