Arjuna Phalguna Movie OTT : శ్రీవిష్ణు హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ‘అర్జున ఫల్గుణ’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోంది. డిసెంబర్ 31, 2021న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సక్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక అది అలా ఉంటే ‘అర్జున ఫల్గుణ’ మూవీ ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. ఈ మూవీని రిపబ్లిక్ డే రోజున స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ‘ఆహా’ ఓటీటీ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన పోస్టరును ట్విట్టర్ లో రిలీజ్ చేశారు ఆహా మేకర్స్. మ్యాట్సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ మూవీని నిర్మించగా.. తేజ మర్ని దర్శకత్వం వహించారు ఈ మూవీకి. Arjuna Phalguna Movie ott
‘అర్జున ఫల్గుణ’ మూవీ కథ విషయానికి వస్తే.. తూర్పుగోదావరి జిల్లా ములకల్లంకలో శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, రంగస్థలం మహేశ్, రాంబాబు, ఆస్కార్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరుగుతూ.. వైజాగ్ వెళ్ళి గంజాయి స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఐదుగురు స్నేహితులు వైజాగ్‌లోని అరకు చేరతారు. అక్కడ సరుకు తీసుకొని.. ఒరిస్సాలో దాన్ని అందచేసి డబ్బులు తీసుకొని మళ్ళీ వైజాగ్ వచ్చేయాలని ప్లాన్ చేస్తారు. అయితే అనూహ్యంగా ఈ మిత్ర బృందం పోలీసులకు చిక్కుతారు. అక్కడనుంచి కష్టపడి తప్పించుకొని తిరిగి తమ ఊరికి వచ్చేస్తారు. పోలీసులు వీరిని వేటాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఊరిలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఆ అనూహ్యమైన సంఘటనలు ఏంటి? అర్జున్ మిత్ర బృందం ఈ కేసునుంచి ఎలా బైట పడ్డారు? వంటి ఆసక్తికరమైన అంశాలతో ‘అర్జున ఫల్గుణ’ మూవీ తెరకెక్కింది.
A fun yet thrilling ride of friendship, love & greed will premiere on Jan 26. #ArjunaPhalgunaOnAHA@sreevishnuoffl @MatineeEnt @DirTejaMarni #AnveshReddy @pasha_always @Actor_Amritha @adityamusic pic.twitter.com/OCzWaiB8fW
— ahavideoIN (@ahavideoIN) January 13, 2022