God Father Teaser : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ గాడ్ ఫాదర్. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌లో దసరా 2022కి మూవీ విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. మూవీ నిర్మాణం పూర్తయినందున అప్పటి నుండి రాబోయే అప్‌డేట్స్ మరియు టీజర్‌ల కోసం మెగాస్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు ఆగస్ట్ 22 న మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టినరోజు. అందుకే, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా, గాడ్ ఫాదర్ మేకర్స్ ఈ రోజు మూవీకి సంబంధించిన అధికారిక టీజర్‌ను విడుదల చేశారు. దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 5 న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.
గాడ్ ఫాదర్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ అధికారిక రీమేక్. గాడ్‌ఫాదర్ మూవీలో చిరంజీవి టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. నయనతార, సల్మాన్‌ఖాన్‌లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. మోహన్ రాజా ఈ మూవీకి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి ఈ మూవీని నిర్మించాయి. గాడ్‌ఫాదర్ మూవీకి భవిష్యత్తులో సీక్వెల్ కూడా ఉండవచ్చు, ఎందుకంటే ఒరిజినల్ మేకర్స్ ఇటీవల లూసిఫెర్ 2 ని ప్రకటించారు.