కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే హీరో గోపీచంద్. ఈయన హీరోగా నటిస్తున్న మూవీ పక్కా కమర్షియల్. ఈ మధ్యే సీటీమార్ మూవీతో పర్లేదనిపించిన గోపీచంద్.. ఆ తర్వాత ఆరడుగుల బుల్లెట్ మూవీతో వచ్చాడు. అయితే ఆ మూవీ వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. నాలుగేళ్ళ పాటు నానా తంటాలు పడి విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పక్కా కమర్షియల్ అంటూ క్రేజీ ప్రాజెక్టుతో వస్తున్నాడు గోపీచంద్.
తాజాగా టీజర్‌ని మూవీ యూనిట్ విడుదల చేసింది. గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. టైటిల్‌కి తగ్గట్టు మూవీలో కమర్షియల్ హంగులు పక్కాగా ఉన్నాయని టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. ‘ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్ పెట్టకూడదు.. ఇలా పెట్టాలి’ అంటూ రాశీఖన్నా చేసే హడావుడి సరదాగా ఉంది. కోర్టు నేపథ్యంలో సాగే ఈ మూవీలో గోపీచంద్, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు. మరి లాయరైన గోపీచంద్ విలనిజం గురించి చెప్తూ ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. జాక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.