టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలైన భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ సినిమాలు 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి. ఆచార్య కూడా సంక్రాంతికే రిలీజ్ కావచ్చని వార్తలు వచ్చినా సంక్రాంతి పోటీకి ఆచార్య దాదాపుగా దూరమైనట్టే అని సమాచారం. గత రెండు రోజులుగా పుష్ప రిలీజ్ డేట్ మారనుందని వార్తలు వస్తున్నాయి. పుష్ప మేకర్స్ వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించకపోవడంతో చాలామంది ఆ వార్తలు నిజమేనని నమ్ముతున్నారు.
తాజాగా ‘ఆచార్య’ రిలీజ్ విషయంలో దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్సయినట్లుగా తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రాావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాాగా కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూనే చిత్రంలో ఎంతో కీలకమైన సిద్ద అనే పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.