మంగళవారం సాయంత్రం పోసాని కృష్ణ మురళి దారుణంగా పవన్ ఫై బూతులు మాట్లాడారు. అక్కడి తో ఆగకుండా పంజాబీ అమ్మాయి ని మోసం చేసారంటూ మీడియా ముందు పెద్ద బాంబ్ పేల్చారు. పంజాబీ అమ్మాయి అనగానే అందరూ కూడా పూనమ్ కౌర్ పేరు బయటకు తీశారు. ఇక వైసీపీ అభిమానులు కొంతమంది పూనమ్ కౌర్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఒక అభిమాని అయితే ‘ఏదైనా విశేషం ఉందా? పవన్ కళ్యాణ్‌తో’ అని ట్వీట్ పెట్టగా.. పూనమ్ కౌర్ తనదైన శైలిలో స్పందించారు.
‘మీరు అందరూ కలిసి అందరి ముందు మీ రాజకీయ లబ్ధి కోసం మీ లెవల్‌కి తగ్గేట్టు టీవీ ముందు చేయించారుగా పెళ్లి.. అందుకుని ఈరోజు వరకూ గుడ్ న్యూస్ లేదు.. ఆడవాళ్లని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారుగా.. అసలు మీది మగజాతేనా? అని ప్రశ్నించింది పూనమ్ కౌర్.
తిరిగి ఆ వైసీపీ అభిమాని రియాక్ట్ అవుతూ.. ‘పీకే గారు ఏమి చేసినా దేశం కోసం ధర్మం కోసమే చేస్తారు మేడమ్.. దయచేసి మీ దేవుడ్ని అర్థం చేసుకోండి’ అని కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్వీట్స్ తో పూనమ్ పేరు మీడియా లో మళ్లీ వైరల్ గా మారింది.