‘వెన్నెల’ ఎంటర్టైనర్ తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ లాంటి గొప్ప సినిమాతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు దేవా కట్టా. ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయిన దేవా.. ఇప్పుడు ‘రిపబ్లిక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆసక్తికర ప్రోమోలతో.. దేవా నుంచి వచ్చిన మరో ‘ప్రస్థానం’లా కనిపించిందీ చిత్రం. మరి ఆ అంచనాలను సినిమా ఏ మేర అందుకుందో చూడండి.