Bright Telangana
Image default

Virupaksha Title Glimpse : సాయి ధరమ్ తేజ్ మూవీ టైటిల్ ‘విరూపాక్ష’

Virupaksha Title Glimpse

Virupaksha Title Glimpse : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఇంటికే పరితమైన ఈ యంగ్ హీరో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. తన 15 వ మూవీకి విరూపాక్ష అనే టైటిల్ ఫిక్స్ చేసారు. మెగా అల్లుడు గా ఇండస్ట్రీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తేజ్..అతి తక్కువ సినిమాలతోనే మెగా అభిమానులను , మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన 15 వ మూవీ తో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తుండగా.. ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఏప్రిల్ 21, 2023 న విడుదల కాబోతుంది.

ఈ సందర్బంగా బుధువారం టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్‌ ను రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్‌ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ‘అజ్ఞానం భయానికి మూలం.. భయం మూఢ నమ్మకానికి కారణం.. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’ అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా ఉంది. ఇక, ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ఇక పోతే ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Related posts

Virupaksha Teaser : విరూపాక్ష టీజర్.. కొత్త కథతో విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారుగా..

Hardworkneverfail

రిపబ్లిక్ మూవీ రివ్యూ

Hardworkneverfail

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Hardworkneverfail

Sai Dharam Tej: టీమ్‌తో కలిసి ఓటీటీలో ‘రిపబ్లిక్’ మూవీ చూసిన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

ఓటీటీలోకి వస్తున్న సాయిధరమ్‌తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ

Hardworkneverfail

Sai Dharam Tej: మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail