Bright Telangana
Image default

TSRTC: ఆర్టీసీ యూనియన్లపై ప్రభుత్వం విధించిన రెండేళ్ల నిషేధం గడువు పూర్తి

telangana rtc bus charges hike

తెలంగాణ : ఆర్టీసీ యూనియన్లపై ప్రభుత్వం విధించిన రెండేళ్ల నిషేధం గడువు పూర్తయ్యింది. కానీ సంఘం ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు సీసీఎస్ పాలకమండలి కాలపరిమితి ఈ నెలతో ముగియనుంది. దాని ప్లేస్ లో పీఏసీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఆర్టీసీ అభివృద్ధికి ఎండీ సజ్జనార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేత హన్మంతు ముదిరాజ్ తెలిపారు. యూనియన్ల బదులు ముఖ్యమంత్రి వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదన్నారు. 2017 నుంచి రెండు వేతన సవరణలు 5డీఏలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి సంస్థకు యూనియన్లు ఎంతో కీలకం. యూనియన్లపై ఉక్కుపాదం మోపుతూ కార్మిక చట్టానికి విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం యూనియ‌న్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందో లేదో చూడాలి.

Related posts

Controversial Comments : అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు

Hardworkneverfail

సీఎం కేసీఆర్ పతనం ఆరంభమైంది: ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Hardworkneverfail

Minister Harish Rao : కోవిషీల్డ్ టీకా డోసుల వ్యవధి తగ్గించండి

Hardworkneverfail

Omicron Restrictions In Telangana : తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు నిషేధం..

Hardworkneverfail

హుజూరాబాద్, బద్వేల్ నియోజవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెర..

Hardworkneverfail

దళిత బంధు అమలు చేయకపోతే.. ఉద్యమం తప్పదు : బండి సంజయ్ వార్నింగ్

Hardworkneverfail