అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. ‘జీఏ2 పిక్చర్స్’ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయ్యింది. దసరా సెలవు కూడా కలిసి రావడంతో సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది. ఈ మూవీ మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయి. దాంతో మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే….
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్ వచ్చిన షేర్ :
నైజాం | 7.50 cr |
సీడెడ్ | 4.01 cr |
ఈస్ట్ | 1.22 cr |
వెస్ట్ | 0.99 cr |
ఉత్తరాంధ్ర | 2.37 cr |
గుంటూరు | 1.38 cr |
నెల్లూరు | 0.83 cr |
కృష్ణా | 1.11 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 19.41 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.87 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 23.28 cr |
అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీకి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వీక్స్ తర్వాత 4.28 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది.