Akhanda Movie Collections Till Now : నందమూరి బాలకృష్ణ బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్నాడు. సింహా, లెజెండ్ మూవీస్ తర్వాత బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో లో వచ్చిన అఖండ మూవీ మూడో రోజు కూడా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఈ మూవీ 1st డే 18.92 కోట్ల షేర్ ను వసూల్ చేయగా రెండో రోజు పూర్తీ అయ్యే టైం కి 26.49 కోట్ల షేర్ ను అందుకుని సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ మూడో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే....
నైజాం | 9.20 cr |
ఉత్తరాంధ్ర | 2.87 cr |
సీడెడ్ | 7.78 cr |
ఈస్ట్ | 2.05 cr |
వెస్ట్ | 1.60 cr |
గుంటూరు | 2.71 cr |
నెల్లూరు | 1.17 cr |
కృష్ణా | 1.41 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 29.28 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 6.20 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 35.48 cr |
‘అఖండ’ మూవీ రూ.53.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ. 54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీ మూడు రోజులు పూర్తయ్యేసరికి రూ.35.48 కోట్లు షేర్ ను రాబట్టింది. బాలకృష్ణ కెరీర్ లో ఫాస్టెస్ట్ 60 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన మూవీ అయ్యింది. క్లీన్ హిట్ కోసం ఇంకా 18.52 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద అఖండమైన కలెక్షన్స్ తో ఈ మూవీ మొదటి మూడు రోజులు దుమ్ము లేపింది. అఖండ 4వ రోజు మరింత కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆ రచ్చ ఏ లెవల్ లో ఉంటుందో చూడాలి మరి.
akhanda 1st weekend collection, tollywood box office collections, అఖండ, akhanda, akhanda movie collections, akhanda collections,akhanda movie collections till now