Oke Oka Jeevitham Teaser : యంగ్ హీరో శర్వానంద్ మైలురాయి 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’ టీజర్ విడుదలైంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ టీజర్లో నాజర్ ఆశ్చర్యకరమైన విషయం గురించి వెల్లడించడంతో మొదలవుతుంది. ముగ్గురు స్నేహితులు శర్వానంద్, వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి వారి బాల్యంలోకి టైమ్ మెషిన్లో ప్రయాణించడంతో.. ఆ మిషన్ రూల్స్ ఎలా పాటించాలో చెప్పడం లాంటివి టీజర్ లో చూపించారు. టీజర్ ఆద్యంతం ఆసక్తి రేపుతోంది.
టీజర్లో అమల అక్కినేని, రీతూ వర్మల గ్లింప్స్ కూడా చూడొచ్చు. అమల శర్వా తల్లిగా, రీతు అతని స్నేహితురాలిగా నటిస్తున్నారు. శర్వా గిటారిస్ట్‌గా కనిపించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ‘ఒకే ఒక జీవితం’ 2022లో విడుదల కానుంది.