Dj Tillu 1st Week Collections : డిజే టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఫస్ట్ వీక్ పూర్తీ చేసుకుంది. మొదటి రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన డిజే టిల్లు మూవీ ఇప్పుడు ఊరమాస్ ప్రాఫిట్స్ తో జోరు చూపింది.
మూవీ 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. 6 వ రోజు మూవీ మొత్తం మీద 81 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మూవీ 7 వ రోజు 55 లక్షల నుండి 60 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా మూవీ ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి ఏకంగా 72 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మూవీ టోటల్ గా ఫస్ట్ వీక్ (Dj Tillu 1st Week Collection) పూర్తీ చేసుకున్న తర్వాత సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
నైజాం | 5.68 cr |
ఉత్తరాంధ్ర | 1.02 cr |
సీడెడ్ | 1.45 cr |
ఈస్ట్ | 0.60 cr |
వెస్ట్ | 0.66 cr |
గుంటూరు | 0.56 cr |
నెల్లూరు | 0.35 cr |
కృష్ణా | 0.47 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 10.79 cr (18.90CR Gross) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.80 cr |
ఓవర్సీస్ | 1.80 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 13.39 cr (23.72CR Gross) |
డిజే టిల్లు మూవీ 9.50 కోట్ల టార్గెట్ కి ఇప్పటి వరకు 3.89 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది. టోటల్ గ్రాస్ లెక్క 23.72 కోట్ల మార్క్ తో దుమ్ము లేపింది డిజే టిల్లు మూవీ.